దానిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు: కేశినేని

దానిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు: కేశినేని
x
Highlights

ఎంపీ కేశినేని నాని వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న నానిని బుజ్జగించేందుకు గల్లా జయదేవ్‌ రంగంలోకి...

ఎంపీ కేశినేని నాని వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న నానిని బుజ్జగించేందుకు గల్లా జయదేవ్‌ రంగంలోకి దిగారు. అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో కేశినేని నానితో గల్లా జయదేవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన నాని.. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలే తాను పంచుకున్నానని ఆ స్వతంత్య్రం తనకుందన్న నాని.. దానిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. లోక్ సభలో టీడీపీపక్షనేత గా వుండడానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని విముఖత వ్యక్తం చేస్తూ తన కంటే సమర్థవంతమైన వ్యక్తిని ఈ పదవిలో నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీ తీర్థంపుచ్చుకుంటురన్నా వార్తలకు స్పందించారు. బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories