టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు ఎదురింటి ఆంటీ షాక్

Submitted by arun on Sat, 06/09/2018 - 12:35
student

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. నగరంలోని నున్నలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన విజయవాడ పాయకాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాయకాపురం వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ (45) భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న పదిహేనేళ్ల బాలుడు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎదురింటి వారనే చొరవతో ఆ బాలుడు ఆ మహిళ ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో అతనితో ఆమె అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. పైగా పిలిచినప్పుడల్లా తన వద్దకు రావాలని ఒత్తిడి చేయడంతో ఆ బాలుడు భయపడ్డాడు. అప్పటి నుంచి అక్కడ ఉండడం మానేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి రావకపోవడానికి కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో బాలుడి తల్లి ఆ మహిళపై చేయి చేసుకుంది. దీంతో ఆ మహిళ నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా, వారు అసలు విషయం చెప్పారు. దీంతో ఆ మహిళపై బాలల హక్కుల సంరక్షణ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

English Title
Woman sexually Harassing tenth class student

MORE FROM AUTHOR

RELATED ARTICLES