పెళ్లిలో భార్య డాన్స్ చేసిందని..

పెళ్లిలో భార్య డాన్స్ చేసిందని..
x
Highlights

పెళ్లిలో డాన్స్ చేసిందనే కారణంతో భార్యను అతిదారుణంగా చంపాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది....

పెళ్లిలో డాన్స్ చేసిందనే కారణంతో భార్యను అతిదారుణంగా చంపాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్లిన స్వప్నను.. తల్లితో కలిసి సుబీర్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరిని నమ్మించేందుకు యత్నించాడు. కానీ, స్థానికులు, స్వప్న తల్లిదండ్రులు సుబీరే ఆమెను హత్యచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన రోజు నుంచి సుబీర్‌ కట్నం కోసం స్వప్నను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త సుబీర్, అతని తల్లిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories