మాజీ ప్రియుడిని నదిలో తోసేసిన మహిళ..

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 18:50
woman-kills-ex-boy-friend-and-dumps-body-yamuna

మాజీ ప్రియుడు తన న్యూడ్ ఫోటోలను సామజిక మధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో అతన్ని నదిలోకి నెట్టి ప్రాణాలు తీసిందో మహిళ. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. నొయిడాకు చెందిన డాలీ చౌదరీ(21), సుశీల్‌ కుమార్‌(23)లు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం వారిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. దాంతో వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మోహిత్‌ మావి(28) అనే వ్యక్తితో గ్రేటర్‌ నోయిడాలో డాలీ చౌదరీ సహజీవనం చేస్తోంది. అయితే తన భర్త డాలీ చౌదరీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి మోహిత్‌ భార్య ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య తరపు బంధువులు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో మోహిత్‌ బెంగుళూరుకు పారిపోయాడు. అయితే ఇటీవల డాలీకి మనీష్‌ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని డాలీ తండ్రి అనుకున్నాడు. కానీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆ పెళ్లి కుదరలేదు. ఇదేఅదనుగా భావించిన డాలి మొదటి ప్రియుడు ఆమెతో మళ్ళీ స్నేహానికి ప్రయత్నించాడు. కానీ ఆమె నిరాకరించింది.అతను తన మాట వినకుంటే నీ న్యూడ్ ఫోటోలను సామజిక మాధ్యమాల్లో పెడతానని డాలీని బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిన డాలి హత్యకు పథకం రచించింది. సమస్యను పరిష్కరించుకుందామనిఓ హోటల్ కు పిలిచింది. అక్కడే మరో వ్యక్తి సహాయంతో కూల్‌ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి సుశీల్‌కు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనంతరం ఇద్దరు కలసి సుశీల్‌ కుమార్‌ను చంపి ఆ తర్వాత మాధురా రైల్వే స్టేషన్‌ వద్ద యమునా నదిలో పడేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English Title
woman-kills-ex-boy-friend-and-dumps-body-yamuna

MORE FROM AUTHOR

RELATED ARTICLES