యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అత్యాచారం

యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అత్యాచారం
x
Highlights

యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌‌లో...

యువతిపై బీఎస్‌ఎఫ్‌ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. లైంగికదాడికి పాల్పాడి వీడియో తీసి పెళ్లి ప్రస్తావన తెస్తే ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించేవాడని.. జవాను వేధింపుల్ని తట్టుకోలేక తన కూతురు ప్రాణాలు తీసుకుందని ఫిర్యాదులో పేర్కోన్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories