గర్భిణీని 12 కిలోమీటర్లు భుజాలపై మోసిన భర్త

Submitted by arun on Tue, 07/31/2018 - 15:38

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. అడవులనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న గిరిపుత్రులకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. విద్య, వైద్య అవసరాలు కూడా లేక నేటికి ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఓ బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నరక యాతను అనుభవించారు. సాలూరు మండలం సిరివరకు చెందిన జిందమ్మ అనే గిరిజన మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతి చెందగా తల్లి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. 

నెలలు నిండకుండానే కాన్పు కావడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు కన్నుమూసింది. మరోవైపు జిందమ్మకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో భర్త, సోదరుడు, స్థానికులు ఆమెను రక్షించేందుకు నడుం బిగించారు. డోలీకట్టి అందులోజిందమ్మను ఉంచి సోమవారం 12 కి.మీ.కు పైగా కొండ మార్గంలో జోరు వర్షంలో నడిచి దుగ్గేరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఆమెను 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరానికి తరలించనున్నట్లు సమాచారం.
   
జిందమ్మకు పుట్టిన కొడుకు చనిపోవడంతో ఆమె సోదరుడు ఆవేదన చెందుతున్నాడు. తన సోదరిని బ్రతికించుకోడానికి తమ కుటుంబ సభ్యులంతా ఏ విధంగా శ్రమించారో మీడియాకు వివరించాడు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికైనా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాడు. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామాలు, గిరిజన తండాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన నేతలు అధికారంలోకి వగెలిచాక పల్లెలనే మరుస్తున్నారు. కనీస వైద్య సౌకర్యాల కల్పనపై దృష్టిసారించడం లేదు. దీంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు.

English Title
woman carried for 12 km to nearest ambulance

MORE FROM AUTHOR

RELATED ARTICLES