పనిమనిషిని అంత దారుణంగా..

Submitted by arun on Sat, 06/30/2018 - 14:24
cam

తనకు ఎన్నో ఏళ్లుగా ఉపాధిని కల్పిస్తూ.. కష్టాల్లో తోడుగా ఉన్న యజమాని పట్ల విశ్వాసం చూపిన ఓ పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంటి యజమాని కొడుకు, కోడలు.. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తన కొడుకు-కోడలితో కలిసి నివసించేది. అయితే కోడలితో అత్తకి ఎప్పుడూ పడేది కాదు. మద్ధతుగా ఉండాల్సిన కొడుకు కూడా కోడలికే వంత పడటంతో ఆ జంటను ఇంటి నుంచి పంపించేసింది ఆ మహిళ..ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది. కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు. ఆమె దుస్తులు చించి, పిడి గుద్దులు గుప్పించారు. రోడ్ల వెంబడి పరుగులు పెట్టించారు. అడ్డుకోవటానికి యత్నించిన తల్లిపై కూడా దాడికి యత్నించారు. స్థానికులు చూస్తూ ఉండిపోయారే తప్ప(వీడియోలు మాత్రం తీశారు).. సాయానికి ముందుకు రాలేదు. చివరకు అక్కడి నుంచి పారిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతుల కోసం గాలింపు చేపట్టారు.   

English Title
woman beaten

MORE FROM AUTHOR

RELATED ARTICLES