కిలాడీ లేడీ..3 పెళ్లిళ్లు.. 6 సహజీవనాలు.. ఎన్నారైలే దీప్తి టార్గెట్!

Submitted by arun on Thu, 01/25/2018 - 16:05
woman

విజయవాడలో కిలాడీ లేడీ దీప్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు బ్రాడీపేటలో నివాసముంటున్న దీప్తి మ్యాట్రీమోనీలో ఫేక్‌ ప్రొఫైల్స్‌తో ఎన్నారైలను మోసం చేస్తోంది. అందమైన అమ్మాయిల ఫొటోలతో ఎన్నారైలకు వలేస్తున్న దీప్తి లక్షల రూపాయలు వసూలుచేసి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతోంది. ఇదే తరహాలో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణికుమార్‌ను బురిడీ కొట్టించిన దీప్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షా 86వేల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత బెదిరింపులకు దిగడంతో మోసపోయానని గ్రహించిన ధరణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధరణి ఫిర్యాదుతో దీప్తిని అరెస్ట్‌‌చేసి రిమాండ్‌కి తరలించారు. దీప్తిపై గతంలోనూ ఇలాంటివి అనేక కేసులు ఉన్నాయని డీసీపీ గజరావు భూపాల్‌ తెలిపారుకిలాడీ గురించి చాలా విషయాలు బయటపెట్టారు. గతంలో ముగ్గురితో వివాహం, మరో ముగ్గురితో సహజీవనం చేసినట్టు తేలింది.

English Title
woman arrested for cheating nris in guntur

MORE FROM AUTHOR

RELATED ARTICLES