అత్యాచారం చేసి, డ్రైవర్‌తో పెళ్లి చేయించిన బీజేపీ నేత

Submitted by arun on Mon, 07/30/2018 - 12:39
rape

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మీరట్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ నేత, తన డ్రైవర్‌తో కలిసి ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత కేసు నుంచి తప్పించుకునేందుకు తన డ్రైవర్‌తో ఆ మహిళకు బలవంతంగా వివాహం జరిపించాడు. ఆరు నెలలు ఆమెతో కలిసి ఉన్న ఆ డ్రైవర్ తాజాగా వదిలేయడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. బీజేపీ నాయకుడు విక్కీతనేజా తన డ్రైవరు జైబ్ తో బాధిత మహిళ పెళ్లిని బలవంతంగా చేయించాడు. పెళ్లి అనంతరం ఆరునెలల తర్వాత బీజేపీ నేత డ్రైవరు బాధిత మహిళను వదిలి వెళ్లాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరట్ పోలీసులు బీజేపీ నాయకుడితోపాటు అతని డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారం జరిపి జైలు పాలైన ఘటన మరవక ముందే మీరట్‌లో మరో ఘటన జరగడం సంచలనం రేపింది.
 

English Title
Woman accuses BJP worker of rape in Meerut

MORE FROM AUTHOR

RELATED ARTICLES