ఆపరేషన్ గరుడ 2...కలకలం రేపతున్న సినీ హీరో శివాజీ ఆరోపణలు

x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ మళ్ళీ ప్రారంభమైందా..? సీఎం చంద్రబాబు టార్గెట్‌ గా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా..? సోమవారం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు...

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ మళ్ళీ ప్రారంభమైందా..? సీఎం చంద్రబాబు టార్గెట్‌ గా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా..? సోమవారం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చంద్రబాబుకి తాఖీదులు అందబోతున్నాయా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

సినీ హీరో , ప్రత్యేక హోదా సాథనా సమితి నాయకుడు, శివాజీ విజయవాడలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వబోతోందంటూ శివాజీ చెప్పడం కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు వల్ల బీజేపీకి ఇబ్బంది ఉందన్న కారణంగానే కేంద్రం పంజా విసరబోతుందని శివాజీ అంటున్నారు. విషయం లీక్ అయ్యింది కాబట్టి నోటీసులు ఇవ్వడం కాస్త లేట్ అవ్వవచ్చని చెప్పారు.

శివాజీ చేసిన ఆరోపణలతో కేంద్రపై టీడీపీ ఘాటుగా స్పందించింది. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే ఆపరేషన్ గడుర నిజమేనని అపిస్తోందని అంటోంది. ఆపరేషన్ గరుడ గురించి చివరికి చంద్రబాబు కూడా స్పందించారు. సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బెదిరిస్తోందని అన్నారు. దక్షిణాదిన కమలదళం బలం పెరగదనే నిర్ణయానికి రావడం వల్లే బీజేపీ వ్యతిరేక శక్తులను అణిచేయాలని చూస్తోందని టీడీపీ అంటోంది. ఎవరెన్ని ఆపరేషన్‌లు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరని వారి ఆటలు సాగవని హెచ్చరించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories