'సైరా' తోనైనా బ్రేక్ చేస్తాడా?

సైరా తోనైనా బ్రేక్ చేస్తాడా?
x
Highlights

జ‌యాప‌జ‌యాలు అనేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ సాధార‌ణం. కాక‌పోతే.. ఒక్కోసారి వ‌రుస‌గా విజ‌యాలు ప‌ల‌క‌రిస్తే.. మ‌రోసారి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు...

జ‌యాప‌జ‌యాలు అనేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ సాధార‌ణం. కాక‌పోతే.. ఒక్కోసారి వ‌రుస‌గా విజ‌యాలు ప‌ల‌క‌రిస్తే.. మ‌రోసారి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తాయి. అయితే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి విష‌యంలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుందీ ప‌రిస్థితి. 'కిక్' నుంచి సురేంద‌ర్ రెడ్డి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ హిట్, ఆ త‌రువాత ఫ్లాప్, ఆ త‌రువాత మ‌ళ్లీ హిట్ .. ఇలా సినిమాకో ఫ‌లితం వ‌స్తోంది.

'కిక్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఊస‌ర‌వెల్లి' ఫ్లాప్ అయితే.. ఆ త‌రువాత 'రేసు గుర్రం' రూపంలో హిట్ వ‌చ్చింది. మ‌ళ్లీ 'కిక్ 2' రూపంలో ఫ్లాప్. ఆ త‌రువాత వ‌చ్చిన 'ధ్రువ' హిట్‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి' చేస్తున్న సురేంద‌ర్ రెడ్డికి..ఆర్డ‌ర్ ప్ర‌కారం మ‌ళ్లీ ఫ్లాప్ వ‌స్తుందా? లేదంటే ట్రాక్ రికార్డ్‌ని బ్రేక్ చేసేలా హిట్ వ‌స్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories