ఆ ఆరోపణలు రుజువు చేస్తే ఉరేసుకుంటా: బాల్క సుమన్‌

Submitted by arun on Sat, 07/07/2018 - 07:15
bs

తన రాజకీయ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక బురద జల్లుతున్నారని ఎంపీ బాల్క సుమన్‌ తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర ఉరేసుకుంటానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం ఒక ప్రకటనలో సుమన్‌ స్పందించారు. ‘మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. 6 నెలల కిందట సంధ్య నన్ను మోసం చేయాలన్న ఆలోచనతో నా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలో.. భార్య స్థానంలో సంధ్య తన ఫొటోను మార్ఫింగ్‌ చేసింది. నన్ను బ్లాక్‌మెయిల్‌ కూడా చేసింది. ఈ విషయంపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్లో జనవరి 27న ఫిర్యాదు చేయగా.. విచారణలో బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేందుకు ఫొటో మార్ఫింగ్‌ చేసినట్లు సంధ్య, విజేత అంగీకరించారు. సరైన ఆధారాలు సేకరించి ఇద్దరినీ పోలీసులు ఫిబ్రవరి 6న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు’’ అని తెలిపారు. ఈ మధ్య కాలంలో మళ్లీ అక్కా చెల్లెళ్లల మెసేజ్‌ల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ విషయమై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

English Title
Will hang myself if sexual harassment allegations against me are proved: TRS MP Balka Suman

MORE FROM AUTHOR

RELATED ARTICLES