పెళ్లి త‌ర్వాత కూడా ఆయనతో ట‌చ్‌లోనే ఉంటాను: రేణూ దేశాయ్‌

Submitted by arun on Thu, 06/28/2018 - 16:56
renu

త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న న‌టి రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. అభిమానుల బెదిరింపులు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండాల‌నే ఉద్దేశంతో ఇటీవ‌లె రేణు ట్విటర్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రేణు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల గురించి మాట్లాడారు. అయితే ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్ తో టచ్ లో ఉంటారా అని ప్రశ్నించాడు. దీనికి మరో మాట ఆలోచించకూడా తప్పక ఉంటానని చెప్పింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం తప్పక టచ్ లో ఉండాల్సిందే. సెలవులు వచ్చినప్పుడు , లేదా ఏవైన వేడుకలు ఉన్నప్పుడు అకీరా, ఆద్యాలు తప్పక ఆయన దగ్గరకు వెళతారు అని చెప్పుకొచ్చింది. రేణూ మాటలతో అభిమానులలో ఉన్న పలు అనుమానాలు తొలగిపోయినట్టు అయింది. రేణూ ఇటీవల తన ట్విట్టర్ లో అకీరాని జూనియర్ పవర్ స్టార్ అని సంబోదించొద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే.

English Title
Will be in touch with Pawan Kalyan Despite Marriage: Renu Desai

MORE FROM AUTHOR

RELATED ARTICLES