భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..

Submitted by arun on Sat, 06/16/2018 - 16:39

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడంటూ.. కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి హనుమాన్‌నగర్‌కు చెందిన కావలి మల్లయ్య.. సొంత భార్య చేతిలోనే హతమయ్యాడు. ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి.. పార్వతమ్మ తన భర్త మల్లయ్యను హత్య చేసింది. తర్వాత బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఓ సంచిలో మూటకట్టారు. తర్వాత నాగనూల్ నడి చెరువులోని ఓ చెట్టుకు మూటను కట్టారు. 45 రోజుల విచారణ తర్వాత విషయం వెలుగుచూసింది. తన భర్త మల్లయ్య కనబడటం లేదని.. 45 రోజుల క్రితం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో భార్య పార్వతమ్మ కంప్లైంట్ ఇవ్వగా.. విచారణ జరిపిన పోలీసులు.. భార్యే నిందితురాలని తేల్చారు. 

English Title
wife murders husband

MORE FROM AUTHOR

RELATED ARTICLES