ఆమెకు 35, అతనికి 25....ఇద్దరు కూతుళ్లున్నా.. ఎఫైర్ నడుపుతున్న మహిళ

Submitted by arun on Wed, 06/27/2018 - 10:36

భర్త, ఇద్దరు కూతుళ్లున్న ఓ వివాహిత.. మరొకరితో సంబంధం పెట్టుకుని.. బజారును పడింది. కోటీశ్వరుడైన వ్యాపారవేత్తకు భార్య అయినా.. తప్పుదారి పట్టి సంసారాన్ని నాశనం చేసుకుంది. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన 35 యేళ్ల ఓ వివాహిత.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన మాధవ్ అనే కుర్రాడితో సంబంధం పెట్టుకుంది. భర్త బిజినెస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో కారు వాషింగ్ షాప్ ఓనర్ అయిన పాతికేళ్ల మాధవ్ తో పరిచయం పెంచుకుని రహస్యంగా సంబంధం పెట్టుకుంది. 

ఓ రోజూ అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులో కలుసుకున్న వీరిద్దరిని భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే అప్పటి నుంచి తాను మారుతానని.. తప్పుడు పనులేవీ చేయబోనని భర్తను వేడుకుంది. అయినా మారని ఆ వివాహిత.. తన ప్రియుడు మాధవ్‌ను కారులో ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. అయితే దీన్ని ముందే గమనించిన భర్త.. భార్య కారుకు జియో ట్యాగ్ అమర్చాడు. దీంతో తన భార్య గోవాలోని ఓ హోటల్‌లో ఉందని.. తనను అరెస్ట్ చేయాలని.. ఎస్‌ ఆర్‌ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తనను మోసం చేసిన తన భార్యపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. తన కూతుళ్లను తనదగ్గరే పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ.. పోలీసులికిచ్చిన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. 

English Title
Wife Cheating Her Husband For Lover

MORE FROM AUTHOR

RELATED ARTICLES