ప్రియుడితో కలిసి భర్తకే స్పాట్ పెట్టిన భార్య...సినిమా స్టోరీనే తలదన్నేలా స్క్రీన్ ప్లే

Submitted by arun on Tue, 06/26/2018 - 12:18

ప్రేమించింది ఒకరిని.. పెళ్లి చేసుకుంది మరొకరిని. అయితే మనస్సు మాత్రం మనువాడిన వాడిని కాదని చెప్పింది. అంతే ప్రియుడితో కలిసి భర్తకు స్పాట్ పెట్టింది. ఎలాగైన వదిలించుకునేలా ప్లాన్ చేసింది. పేరు ప్రఖ్యాతలున్న వారి పరువు తీస్తే ప్రాణం తీసినట్లే అని అనుకున్న వివాహిత షర్మిల.. తన ప్రియుడు సయ్యద్ వలీతో కలిసి.. భర్త డాక్టర్ సంతోష్‌ను ఏకంగా మేల్ ఎస్కార్ట్‌గా క్రియేట్ చేసింది. లొకెంటో అనే సైట్లో మేల్ ఎస్కార్ట్‌గా ఉన్నారంటూ తన భర్తకే తాను చూపించింది. దీంతో షాక్ తిన్న సంతోష్.. విషయం ఆరా తీస్తే బండారం బట్టబయలైంది. ప్రియుడితో కలిసే తన భార్యే తనను మోసం చేసిందని తెలుసుకున్నాడు. దీంట్లో భార్య షర్మిల తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని పోలీసుల సహకారంతో తెలుసుకున్నాడు. ప్రస్తుతం అతను భార్యతో విడాకులు కావాలని.. చట్టబద్దంగా వారిని శిక్షించాలని.. డిమాండ్ చేస్తున్నాడు. లేనిపోని ఆరోపణలతో తనపైనే రివర్స్ కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టొద్దని బాధితుడు సంతోష్.. వేడుకుంటున్నాడు. ఇటు షర్మిల, ఆమె ప్రియుడు వలీని అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
Wife Cheated Husband For Lover

MORE FROM AUTHOR

RELATED ARTICLES