విజయవాడ సూర్యారావుపేటలో విషాదం..

Submitted by arun on Wed, 01/31/2018 - 12:35
old CoupleSuicide

విజయవాడ సూర్యారావుపేటలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో ఇటీవల చేరిన సత్యరాణి, ఆమె భర్త రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ దంపతుల మృతికి ఆర్థిక కారణాలే కారణమని భావిస్తున్నారు.

కన్నీళ్లుపెట్టించిన సూసైడ్‌ నోట్‌
తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని తుమ్మలపల్లి రామకృష్ణ సూసైడ్‌ నోట్‌లో రాశారు. తన జేబులో ఉన్న 8 వేల రూపాయలతో దహన సంస్కారాలు జరిపించాలని అభ్యర్థించారు.

English Title
wife and husband suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES