హైదరాబాదే ఎందుకు డిసైడ్‌ చేసుకున్నారు? తెర వెనుక ఏం జరిగింది?

హైదరాబాదే ఎందుకు డిసైడ్‌ చేసుకున్నారు? తెర వెనుక ఏం జరిగింది?
x
Highlights

అనుకున్నట్టే కన్నడ పీఠం దక్కించుకున్న బీజేపీ బలనిరూపణపై దృష్టి సారించిందా ? విపక్ష ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు...

అనుకున్నట్టే కన్నడ పీఠం దక్కించుకున్న బీజేపీ బలనిరూపణపై దృష్టి సారించిందా ? విపక్ష ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేపట్టిందా ;? కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో పలువురు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా ? ఆపరేషన్ కమల్‌ 2 పేరుతో బలనిరూపణకు ఏర్పాట్లు చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్నాయి.

బలనిరూపణ సమయంలో మేజిక్ ఫిగర్ దక్కించుకునేందుకు బీజేపీ భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నాటక శాసనసభలో ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలు ఉండగా .. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బలపరీక్షనిరూపణ నేపధ్యంలో స్వీకర్ ఎంపిక అత్యంత కీలకంగా మారనుంది. తమ పక్షానికి చెందిన వ్యక్తినే స్పీకర్ చేయాలని భావిస్తున్న బీజేపీ పక్షం తొలుత 7 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఫిరాయింపుదార్లకు వ్యతిరేకంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా కాలయాపన చేసేలా పథక రచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బలనిరూపణ సమయంలో ఈ ఏడుగురిని ఓటింగ్‌కు దూరంగా ఉంచడం ద్వారా ఎమ్మెల్యేల బలం 221 నుంచి 214కు చేరుతుంది. దీంతో మేజిక్ ఫిగర్ 107కి చేరుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం దృష్యా మరో ఇద్దరు సభ్యులు మద్ధతిస్తే బలనిరూపణలో విజయం సాధించేలా ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డిలకు అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వారితో ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంప్రదింపులు జరుపుతుండగా .. రాయచూరు, బళ్ళారి, కొప్పళ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో గాలి బ్రదర్స్‌ బిజీగా ఉన్నారు. వీరి వ్యూహం ఫలించి బళ్ళారి జిల్లా విజయనగరం ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌, మాస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్‌ బీజేపీ శిబిరంలో చేరినట్టు భావిస్తున్నారు. బీజేపీ నేతలతో మొత్తం 16 మంది టచ్‌లో ఉన్నారని చెబుతున్నా వ్యూహాత్మకంగా పేర్లు బయటకు వెళ్లడించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories