అన్నా రాంబాబు ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీచేయ‌లేరు..?

Submitted by hmtvdt on Tue, 04/24/2018 - 21:58
Anna Rambabu cannot contest elections

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తారా..?  లేదా అనేది ఆ జిల్లా రాజ‌కీయాల్లో విసృత ప్ర‌చారం జ‌రుగుతోంది.   మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఒక మ‌హిళ‌పై జ‌రిగిన ఘ‌ర్ష‌ణ కేసులో ఐదు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌ప‌డింది. ప్ర‌స్తుతానికి బెయిల్ మీద ఉన్న ఆయ‌న .. పై కోర్టును ఆశ్ర‌యించారు. 
ఈ నేప‌థ్యంలో అన్నా రాంబాబు కొద్ది నెలల క్రితం టీడీపీ కి రాజీనామా చేసి మ‌రే ఇత‌ర పార్టీలో చేర‌కుండా సైలెంట్ గా ఉన్నారు. మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో అన్న‌ రాంబాబు పోటీ చేయోచ్చా..?  లేదా..? అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. అయితే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కోర్ట్ లో దోషిగా తేలి మూడేళ్ళు జైలు శిక్ష పడితే సెక్షన్ 8 (3) of R.P. Act, 1951 ప్రకారం అతను ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి అనర్హుడు. బెయిల్ మీద బయటకు వచ్చి అతని అప్పీల్ ఇంకా పెండింగ్ లో ఉన్న కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకూడదు. 
కాగా  ఓ వెబ్ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన అన్నా రాంబాబు  ఘర్ష‌ణ కేసుకు సంబంధించి ఐదు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌ప‌డిన‌ట్లు తెలిపారు. దీంతో గిద్ద‌లూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో అన్నా రాంబాబు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేర‌ని జోరుగా ప్ర‌చారం జరుగుతుంది.

English Title
Why cannot Anna Rambabu contest in elections?

MORE FROM AUTHOR

RELATED ARTICLES