రైతు బీమాకు ఎవరు అర్హులంటే...

రైతు బీమాకు ఎవరు అర్హులంటే...
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రైతు బీమా సర్వే.. రేపటి నుంచి ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో.....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రైతు బీమా సర్వే.. రేపటి నుంచి ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో.. పట్టాదారు పాసుపుస్తకం పొందిన, రైతుబంధు చెక్కులు తీసుకున్న ప్రతీ రైతు ఇంటికెళ్లి.. వ్యవసాయ విస్తరణ అధికారులు.. వివరాలు సేకరించనున్నారు. పట్టాదారు పాసుబుక్కులు ఉన్న రైతులంతా ఈ పథకానికి అర్హులు. రైతులు 15 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. 15-08-2018 నుంచి 14-08-2019 వరకు అంటే ఏడాది ఈ బీమా అమలులో ఉంటుంది. ఏడాదికోసారి బీమా పథకాన్ని పునఃరుద్ధరిస్తారు.

దరఖాస్తు చేయాలంటే....
ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం రైతుల వయస్సు లెక్కిస్తారు. ఒకవేళ పట్టిన తేదీ లేకపోతే జూలై 1ని పుట్టిన తేదీగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పట్టాదారుడి ఆధార్ నంబర్, పాసుపుస్తకం నెంబరు, మొబైల్ నెంబరు, ఒకవేళ చనిపోతే డబ్బులు ఎవరికి చెల్లించాలో తెలిపే నామిని పేరు, నామిని ఆధార్, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలతో పాటు రైతు స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్క పట్టాదారుడికి ఆగస్టు15 తర్వాత ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్ జారీ చేస్తుంది. గురువారం నుంచి అధికారులు నామిని వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలను అన్ని మండలాల్లో ఏఈవో క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు రైతుల వద్ద సేకరించనున్నారు.
పది రోజుల్లో పూర్తి...

ఎల్‌ఐసీ, వ్యవసాయ శాఖ ముద్రతో కూడిన దరఖాస్తు ఫారాలు ఇప్పటికే అధికారులకు అందాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు దీనికి సంబంధించి రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు సైతం అధికారులకు సాయం అందించనున్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారం నుంచి పదిరోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని, వర్షాలు పడితే రైతులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories