ఆ ముగ్గురు సీఎంలు ఎవరో?

ఆ ముగ్గురు సీఎంలు ఎవరో?
x
Highlights

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, చత్తీస్ గడ్ వంటి కీలక 3 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది....

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, చత్తీస్ గడ్ వంటి కీలక 3 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే ప్రక్రియ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమే అయినప్పటీ ప్రస్తుత పరిణామాలు మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. సీఎం ఆశావహులతో రాహుల్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించనున్నారు.

మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ‌‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారనే వార్తలు గుప్పమనడంతో జ్యోతిరాధిత్య సింధియా వర్గీయులు ఆందోళనకు దిగారు. తమ నేతకు అన్యాయం చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడికి సీఎం పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. యువకుడైన తమ నాయకుడికి ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని వారు అంటున్నారు.భోపాల్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బ్యానర్లు సింధియా వర్గీయులకు ఆగ్రహం కలిగించాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ వెలసిన బ్యానర్లు ఇరువర్గీయుల మధ్య తగాదాకు దారితీశాయి. విషయం తెలుసుకున్న సింధియా సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించారు.


రాజస్థాన్‌లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించనున్నారనే వార్త వెలువడడంతో సచిన్ పైలెట్ వర్గీయులు ఆందోళనకు దిగారు. కరౌలీ ప్రాంతంలో రహదారులను దిగ్భందించారు. సచిన్ పైలెట్‌కే సీఎం పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. చత్తీస్ గడ్‌లో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధుల అనుచరులు వీరంగం సృష్టించారు. తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మూడు రాష్ట్రాల్లోను అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్‌లో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories