వైసీపీకి 110 సీట్లు... జగనే సీఎం..బీజేపీ జాతీయ నేత జోస్యం

వైసీపీకి 110 సీట్లు... జగనే సీఎం..బీజేపీ జాతీయ నేత జోస్యం
x
Highlights

ఏపీలో పోలింగ్ జరిగి దాదాపు నెల రోజులవుతోంది. అప్పటి నుంచీ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. విజయం తమదేనని వైసీపీ నేతల ధీమా వ్యక్తంచేశారు....

ఏపీలో పోలింగ్ జరిగి దాదాపు నెల రోజులవుతోంది. అప్పటి నుంచీ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. విజయం తమదేనని వైసీపీ నేతల ధీమా వ్యక్తంచేశారు. అటు టీడీపీ సైతం తామే గెలుస్తామని చెబుతోంది. ఇక జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇలా నేతలంతా ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఏపీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీదే అధికారమని జోస్యం చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయన్నారు మురళీధర్ రావు. ఏపీలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టబోతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాతే ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో గత నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ 280 నుంచి 310 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈసారి 35 నుంచి 40 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని నెల రోజుల క్రితం భావించామని, కానీ ఇప్పుడు 70కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలో చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు ముసుకుపోయాయని తమ కూటమిలో టీడీపీ చేరే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇక గతంలో కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఏపీలో వైసీపీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు.





Show Full Article
Print Article
Next Story
More Stories