ప్లీనరీ వేదికగా రాజకీయ వ్యూహాలు...వచ్చే ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యానికి ప్రణాళికలు

x
Highlights

పాలిటికల్‌ స్ట్రాటజీలో తిరుగులేని నాయ‌కుడు సీఎం కేసీఆర్. రాజకీయంగా ఆయన ఓ అడుగు వేశారంటే దాని వెనుక పటిష్ఠమైన దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందంటుంది...

పాలిటికల్‌ స్ట్రాటజీలో తిరుగులేని నాయ‌కుడు సీఎం కేసీఆర్. రాజకీయంగా ఆయన ఓ అడుగు వేశారంటే దాని వెనుక పటిష్ఠమైన దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందంటుంది గులాబీదళం. అలాంటి వ్యూహమే ఇప్పుడు కేసీఆర్‌ రచించబోతున్నారా? ప్లీనరీ వేదికగా ఫ్రంట్‌కు ఓ రూపు తీసుకురాబోతున్నారా? ఉనికి మొద‌లైన చోటే... తన వ్యూహాన్ని ఎలా అమలు చేయబోతున్నారు? ఇంత‌కూ ఏంటా ప్లాన్...? రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోంది..?

ప్లీనరీ వేదికగా రాజకీయ వ్యూహాలు..ఫ్రంట్‌ వెనుక్కి పడకుండా... సరికొత్త మార్గాలు..వచ్చే ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యానికి ప్రణాళికలు..తిరుగులేని రాజకీయ శక్తి ఆవిర్భవించే ప్రయత్నాలు

తెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ పార్టీగా బ‌లం పెంచుకుంటున్న తెలంగాణ రాష్ర్ట సమితి.. తన శక్తి సామర్థ్యాలను మరింతగా పెంచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టినా టీఆర్‌ఎస్‌ ప్రబలశక్తిని, ప్రాబల్యాన్ని దేశవ్యాప్తంగా చేసే వ్యూహాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన అగ్రనాయకుడిగా విశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న కేసీఆర్‌ ప్లీనరీ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఫ్రంట్‌ దిశగా కదలబోతున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభమే కాదు రాజకీయ వ్యూహాల్లోనూ అంతే దిట్ట. రాజకీయంగా ఆయన ఒక్క అడుగు వేస్తే దాని ఫలితం లెక్కబెట్టేందుకు పదేళ్లు పట్టాలంటుంది గులాబీదళం. అందుకే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నా వ్యక్తిగతంగా తన ప్రతిభ, పార్టీ పరంగా ప్రభ దేశవ్యాప్తం చేయడానికి ప్లీనరీ ఓ అద్భుతమైన వేదికగా భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఫ్రంట్‌ కోసం దేశమంతా తిరుగుతామని చెప్పిన కేసీఆర్‌ తొలుత పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని కలిశారు. ఫ్రంట్‌ ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. 2019లో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం తమ ఫ్రంట్‌ వల్లే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు ఇద్దరు సీఎంలు. తర్వాత ఒడిషా ముఖ‌్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవేగౌడను కలసి ఫ్రంట్‌ ఏర్పాటు అవసరంపై చర్చించారు.

ఇలా దేశాన్నంతా ఒక్కటి చేసే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ సీఎం ప్లీనరీని వేదిక చేసుకొని అందరిని ఆహ్వానిస్తారా? ఫ్రంట్‌ దిశగా పడుతున్న అడుగులను మరింత బలోపేతం చేస్తారా? మోడీకి, బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నాయకులను ఏకతాటిపైకి తెస్తారా? ఫ్రంట్‌ ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించి ఎజెండాను రూపొందిస్తారా? అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్లాట్‌ఫామ్‌ కానుందన్న దానిపై ఎవరి అభిప్రాయాలు వారు వినిపిస్తున్నారు. కానీ చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories