మోడీతో వైసీపీ చీకటి ఒప్పందమేంటి?

Submitted by arun on Sat, 03/24/2018 - 12:36
jb

బీజేపీ, టీడీపీ తెగతెంపులకు కారణం ఏంటి..? రెండు పార్టీల మధ్య చిచ్చు రేగడం వెనుక అసలు నిజమేంటి..? వైసీపీ, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందా..? ఒకవేళ అలాంటి ఒప్పందమే కుదిరేతే దానివల్ల ఎవరికి నష్టం... ఎవరికి ఎంత లాభం..? 
 
ఇంతకీ ప్రధాన మంత్రి కార్యాలయంలో తిష్ట వేసిన వ్యక్తి ఎవరు..? కమల నాథులు అక్కున చేర్చుకున్న నేత ఎవరు..? 

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయానికి తరుచూ వెళ్తున్నారని వార్తలు రావడం..టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడంతో మూడు పార్టీల మథ్య మాటల యుద్ధం జరుగుతోంది. పీఎంవో వేదికగా టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అందులో భాగంగానే బీజేపీ, వైసీపీ నేతలు ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదంతా పథకం ప్రకారం కొంతకాలంగా సాగుతోందంటున్నారు.

టీడీపీతో తెగతెంపులు చేసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ నేతలు వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, వైసీపీ, బీజేపీ నేతలు అవినీతి పేరుతో చంద్రబాబుపై కేసులు పెట్టడానికి పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. మరి వైసీపీ, బీజేపీ నేతల ఆరోపణల్లో నిజమెంత టీడీపీ నేతలు చేస్తున్న చీకటి ఒప్పందం ఆరోపణల్లో నిజముందా అనేది కాలమే నిర్ణయించాలి. 

English Title
what is the reason behind ysrcp and bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES