కృష్ణా జిల్లాలో పీటలమీద ఆగిన పెళ్లి..

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 11:15
wedding-cancelled-after-groom-family-suspected-bride

పెళ్లి పీటల దాకా వచ్చి చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటచేసుకుంది. పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి కూతురుపై పెళ్లికొడుక్కి ఇష్టం లేకపోవడమే కారణమంటున్నారు బంధువులు. పామర్రు మండలం నిభానిపూడికి చెందిన నాగశ్రీనుకి తోట్లవల్లూరు వాసి దివ్యకు రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్‌ 2న పెళ్లి కుదుర్చుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కొడుకు పీటలపై నుంచి వెళ్ళిపోయాడు. దివ్యను చేసుకోవడం తనకుఇష్టం లేదని నాగశ్రీను బంధువులకు చెప్పాడు. దీంతో పెళ్లి కూతరు కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు వాళ్ల తల్లితండ్రులు మాటలు విని తనపై లేనిపోని అబాండాలు మోపి, అనుమానపడి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోయాడని పెళ్లికూతురు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

English Title
wedding-cancelled-after-groom-family-suspected-bride

MORE FROM AUTHOR

RELATED ARTICLES