కిలో లెక్క మారింది..

కిలో లెక్క మారింది..
x
Highlights

కిలో వంకాయలు కొంటాం అసలు కిలో అంటే ఏమిటి? ఆగండాగండి.. వెయ్యి గ్రాములు అనేయకండి తొందరపడి. కిలో ప్రామాణికమేమిటి అనేది ప్రశ్న. ఆ తూనికలు కొలతల శాఖ వాళ్ళు...

కిలో వంకాయలు కొంటాం అసలు కిలో అంటే ఏమిటి? ఆగండాగండి.. వెయ్యి గ్రాములు అనేయకండి తొందరపడి. కిలో ప్రామాణికమేమిటి అనేది ప్రశ్న. ఆ తూనికలు కొలతల శాఖ వాళ్ళు లెక్క చూస్తారుగా అని అనేయడమూ సులువే. ఎప్పుడన్నా ఓ సారి దాని గురించి విన్నారా? ఆలోచించారా? బరువును కొలిచే కిలో, విద్యుత్ ను కొలిచే ఆంపియర్, వేడిని కొలిచే కెల్విన్, అణువుల సంఖ్యను చెప్పే మాలిక్యూల్.. వీటిని ప్రామాణికంగా ఎలా నిర్థారిస్తారో తెలుసుకోవాలనిపించిందా? ఈ ప్రశ్నలన్నిటికీ మనలో ఎక్కువ మంది కాదు అనే సమాధానం చెపుతారు. సరే.. ఇపుడెందుకు ఇదంతా అంటే.. ఈ రోజు మన కిలో ప్రామాణికతను నిర్ధారించే విధానం మారింది. అర్థం కాలేదా? సింపుల్ గా చెప్పాలంటే.. తూనికలు కొలతల శాఖ అధికారులు కిలోని కొలిచే విధానం మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా మే 20 ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం.

కిలో ప్రామాణికత ఇలా నిర్ధారిస్తారు..

కిలో ని ప్రామాణికంగా ఎలా నిర్థారిస్తారంటే.. పారిస్ కు దగ్గర్లో సీవరేస్ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్ట భద్రత మధ్య మూడు గాజు సీసాల మధ్య వున్నా అరచేతి పరిమాణం కల ప్లాటినం మిశ్రమం సిలిండర్ ని ప్రామాణికంగా తీసుకుంటారు. దీని కాపీలు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఈ కాపీలు కూడా కాపీ చేశి ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతి నలభై సంవత్సరాల కూ ఒకసారి వివిధ దేశాలకు చెందిన అధికారులు అక్కడికి వెళ్లి తమ దేశపు ప్రామాణిక కిలో రాయిని తీసుకు వెళ్లి ఆ రాయితో సరిపోల్చుకుని తెస్తారు. తరువాత దేశం లోని అన్ని చోట్లా దాని ప్రామాణికత తో కిలోను సరిపెడతారు. సంక్షిప్తంగా జరిగేది ఇంతే.

ఇపుడేం జరిగింది..

ముందు చెప్పినట్టు ఈ ప్రామాణిక సిలెండర్ కాపీలు వంద సంవత్సరాల్లో రకరకాలుగా మారిపోయాయి. ఈ స్థానిక కాపీలను పోల్చిన తరువాత, నిపుణులు 100 సంవత్సరాలలో ± 50 మైక్రోగ్రాముల పరిధిలో బరువు వ్యత్యాసాలను కనుగొన్నారు. దాని వలన వస్తున్నఇబ్బందులు సరి చేసి కొత్త ప్రామాణికా విధానాన్ని తీసుకు వచ్చారు. ఒక కిలోగ్రాము యొక్క కొత్త ప్రమాణం ప్లాంక్ స్థిరాంకం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని లెక్కించేందుకు ఉపయోగించే పరికరం కిబ్బిల్ సంతులనం అంటారు. ఇంకా చాలా భౌతిక శాస్త్ర విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఇపుడు తీసుకు వచ్చిన విధానం ద్వారా తమ కిలో రాయి ప్రామాణికతను నిర్థారించుకోవడానికి పారిస్ వెళ్లే ప్రయాస పడాల్సిన పని లేదు.

కాలం మారుతోంది. కాలం తో పాటే ఎన్నో మార్పులూ చోటు చేసుకుంటున్నాయి. ఇపుడు ఎపుడూ సాధారణ ప్రజలు వినని ఇది విన్నవెంటనే కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ. ప్రపంచంలో సామాన్యులకు తెలీని ఎన్నో విషయాలు ఆలా మారిపోతుంటాయనడానికి ఉదాహరణ గా నిలుస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories