జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు .. నాదెండ్ల

జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు .. నాదెండ్ల
x
Highlights

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఘోర ఓటమిపాలు అయింది .. దీనితో టిడిపి పని అయిపోయిందని టిడిపికి కొత్త నాయకుడు అవసరం అనే చర్చ...

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఘోర ఓటమిపాలు అయింది .. దీనితో టిడిపి పని అయిపోయిందని టిడిపికి కొత్త నాయకుడు అవసరం అనే చర్చ నడిచింది .. ఈ క్రమంలోనే హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర పైకి వచ్చింది .. రామ్ గోపాల్ వర్మ , నటుడు బ్రహ్మాజీ, వైసీపీ మంత్రి నాని లాంటి వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తిరిగి టిడిపిలో జవసత్వాలు నింపీ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పుకొచ్చారు . జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోతే టిడిపికి భవిషత్తు ఉండదని కొన్ని ఉహాగానాలు వినిపించాయి కూడా ..

అయితే ఇదే అంశంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వాఖ్యలు చేసారు ..నేను కూడా ఈ వార్తలు విన్నానని కానీ అసలు తనకి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని వాఖ్యానించారు .. తన సినిమాలు కూడా నేను ఎప్పుడు చూడలేదని ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే నిర్ణయం తీసుకోవాలని అయన అన్నారు .. ప్రస్తుతం అయన చేసిన ఈ వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి .. ఇక ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రావు జనసేనలోకి వెళ్ళడం తప్పిదమేనని పరోక్షంగానే స్పందించారు అయన ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories