సినిమా హాల్‌లో సీటు కింద ఇరుక్కున్న భర్త.. భార్య కళ్లముందే...

సినిమా హాల్‌లో సీటు కింద ఇరుక్కున్న భర్త.. భార్య కళ్లముందే...
x
Highlights

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సినిమా చూడాటానికి థియేటర్ వెళ్లారు ఆ దంపతులు అంతే ఇక అలా వెళ్లడమే వారి జీవితాలను ఆతలకుతం చేసింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో...

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సినిమా చూడాటానికి థియేటర్ వెళ్లారు ఆ దంపతులు అంతే ఇక అలా వెళ్లడమే వారి జీవితాలను ఆతలకుతం చేసింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో స్టార్‌సిటీ కాంప్లెక్స్‌లో ఇద్దరు దంపతులు సినిమా చూడాటనికి వెళ్లారు. సినిమా చూసిన అనంతరం ఇంటికి బయలుదేరుతుండగా వారి కారు కీస్, పరుసు కనిపించలేదు. పర్సు, కారు తాళం పోయినట్లు గమనించాడు. అయితే 24 ఏళ్ల అతీక్ రఫీక్‌కు టక్కున సినిమా థియేటర్ లో తన సీటు కింద పడిపోయి ఉంటాయి అనుకొని వెళ్లాడు సీటు కింద పడ్డాయేమోనని చూశాడు. అలా చూస్తుండగానే పైకి ఉండాల్సిన ఆ సీటు ఫుట్‌రెస్టు అనుకోకుండా కిందకు వాలింది.

దీంతో అతీక్ రఫీక్‌ సీటు కిందనే ఇరుక్కుపోయాడు. అక్కడి నుండి బయటకు రాలేక లాబోదిబో మన్నాడు. భర్త కేకలు విన్న భార్య హుటాహుటినా సెక్యూరిటీని పిలిచి విషయం చెప్పగా వారు ఆ సీటుకు ఉన్న బోల్టులు విప్పి సీటును తొలగించారు. అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. సీటు కింద ఊపిరి తీసుకోవడానికి కూడా గాలి లేకపోవడంతో పాటు విపరీతమైన కంగారు వల్ల అతీక్‌కు హార్ట్‌ఎటాక్ వచ్చింది. దీంతో హుటాహిటినా అతీక్ రఫీక్‌ ను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కాగా సరిగ్గా వారం పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు అతీక్ రఫీక్‌. అయితే ఆ సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల అతీక్ రఫీక్‌ మెదడుకు గట్టి షాక్ తగిలిందని అందువల్లే అతీక్ రఫీక్‌ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో తన భార్య, బంధువులు కన్నీటిపర్యంతంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories