ప్రైవేట్ ట్రావెల్స్‌ మీటింగ్...రవాణా శాఖ క్లాసులు ఫలిస్తాయా..?

ప్రైవేట్ ట్రావెల్స్‌ మీటింగ్...రవాణా శాఖ క్లాసులు ఫలిస్తాయా..?
x
Highlights

ఏపీలో వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు,...

ఏపీలో వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమైన రవాణా శాఖ పలు సూచనలు, సలహాలు అందజేసింది. ప్రతి డ్రైవర్‌‌ను పరిశీలించిన తర్వాతే బస్సు అందించాలని ఆదేశించింది.

వరుస ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష‌్యం కారణంగా అనేక మంది మృత్యుబాట పడుతున్నారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌‌ది ఇష్టారాజ్యమైపోయింది. ఇటీవల తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతూ పట్టుబడ్డారు. డ్రైవర్లు తప్పతాగి బస్సు లు నడుపుతుండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రమాదాలపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఏపీలోని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లతో రవాణా శాఖ అధికారులు భేటీ అయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడపటంపై రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లతో చర్చించారు. ప్రతి ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రతిరోజు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహించి వారానికి ఒకసారైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించే సంస్థల లైసెన్సులను రద్దు చేసే అవకాశముంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాదాలు జరిగితే అందుకు బాధ్యత ట్రావెల్ యజమానిదేనని ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాని అన్నారు. డ్రైవర్లను చెక్ చేసే బస్సు అందిస్తామంటున్నారు. కొంతమంది బస్సు డ్రైవర్లు తాగి బస్సులు నడుపుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories