ఏపీ సచివాలయంలో మళ్లీ వర్షం లీకులు

Submitted by arun on Mon, 08/20/2018 - 15:44
water leakage

ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌రెడ్డి,  ఛాంబర్‌ల్లో సీలింగ్‌ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  పదేపదే లీక్ అవుతున్నా దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినవస్తున్నాయి.

English Title
water leakage in andhra pradesh secretariat

MORE FROM AUTHOR

RELATED ARTICLES