యువ జంట ప్రేమను గెలిచింది

యువ జంట ప్రేమను గెలిచింది
x
Highlights

యువ జంట ప్రేమను గెలిచింది. అమ్మాయి తరపు బంధువులు ప్రేమను నిరాకరించారు. పెళ్లికి సిద్ధమైన అమ్మాయిని లాక్కెళ్లారు. పోలీసుల జోక్యంతో ఒక్కటయ్యారు. అంతా...

యువ జంట ప్రేమను గెలిచింది. అమ్మాయి తరపు బంధువులు ప్రేమను నిరాకరించారు. పెళ్లికి సిద్ధమైన అమ్మాయిని లాక్కెళ్లారు. పోలీసుల జోక్యంతో ఒక్కటయ్యారు. అంతా సినిమా క్లైమాక్స్ లా ఉన్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమను గెలిచిన యువజంటపై ప్రత్యేక కథనం.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్న గుట్టకు చెందిన ప్రణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య మూడేళ్ళుగా ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజ్‌లో పెళ్లికి సిద్ధ పడ్డారు. ఈ ప్రేమ జంటను అమ్మాయి తరపు బంధువులు విడదీశారు. అబ్బాయిని చితకబాది అమ్మాయిని లాక్కెళ్లారు. అప్పట్లో వీరి ప్రేమ, అమ్మాయి కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. పోలీసుల జోక్యంతో వారి ప్రేమ పెళ్లితో ముగిసింది. ఎక్కడ పెళ్లి నిలిచిపోయిందో అక్కడే ఆ యువ జంట ఒక్కటయ్యారు. సినిమా క్లైమాక్స్ ను తలపించేలా ప్రేమ పెళ్లి దుమారం లేపింది.

ఈ జంట అన్యోన్యంగా ఉంటూ ప్రేమకు నిజమైన నిర్వచనం చెబుతున్నారు. ప్రణదీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా సౌజన్య డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమను గెలిపించుకున్న ప్రణదీప్ సౌజన్యలు స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఇప్పుడు రెండు కుటుంబాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ యువజంట చెబుతోంది. నిజమైన ప్రేమకు చావుండదు ఎప్పుడు విజయమే సాధిస్తుందని నిరూపించింది ఈ యువజంట. మూడేళ్ల క్రితం ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకుని ప్రేమను గెలిపించి పెద్దల మనస్సులను గెలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories