ఆకలి వేయడం లేదా ? ఇవి పాటించండి .. !

ఆకలి వేయడం లేదా ? ఇవి పాటించండి .. !
x
Highlights

కొందరికి ఆకలి ఎక్కువ .. మరికొందరికి తక్కువ ఎంత చెప్పిన తినరు .. దీనివల్ల నీరసం, అలసట వస్తున్నాయి. అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు ఈ చిట్కాలు...

కొందరికి ఆకలి ఎక్కువ .. మరికొందరికి తక్కువ ఎంత చెప్పిన తినరు .. దీనివల్ల నీరసం, అలసట వస్తున్నాయి. అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే ఆకలి బాగా అవుతుంది.

* ఆకలి వేయాలంటే ఒక టీ స్పూన్‌ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి పది రోజుల పాటు భోజనానికి అర్థగం ముందు తీసుకున్నట్టయితే ఆకలి బాగా వేస్తుంది.

* ఒక టీ స్పూన్ బెల్లంపొడి, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఏదో ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది.

* ప్రతిరోజూ భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను నిమిలి మింగాలి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాదు ఆకలి కూడా బాగా వేస్తుంది.

* ఒక కప్పులో నీటిని తీసుకుని అందులో ఉసిరిక్కాయ రసం, నిమ్మరసం, తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్ల చొప్పున ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకున్నట్టయితే ఆకలి బాగా వేస్తుంది.

* నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి దంచేయడం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories