గొయ్యి తీసి పాతేస్తా.. మంత్రి అయ్యన్న ఫైర్..

Submitted by nanireddy on Thu, 08/23/2018 - 17:07
war-between-the-twotdp-ministers


 ఏపీ మంత్రి అయ్యపాత్రుడు ఆవేశంతో ఊగిపోయారు.సహచర మంత్రులను కూడా  తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం బస్టాండ్ స్థలంలో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. విషయం తెల్సుకున్న మంత్రి అయ్యన్న అధికారులకు ఫోన్ చేసి వెంటనే పనులను నిలిపివేయాలని సూచించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న అయన ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడితే గొయ్యి తీసి పాతేస్తా అంటూ అధికారులను హెచ్చరించారు. నిర్మాణం చేపట్టేందుకు ఎవరు వచ్చినా అడ్డంగా నరికేస్తానంటూ ఆవేశాన్ని వెళ్లగక్కారు. అవసరమైతే మంత్రి పదవిని వదులుకుంటాను కానీ ప్రభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే ఊరుకోనని అన్నారు. అంతేకాకుండా బస్టాండ్ స్థలంలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ అటు రవాణా శాఖ మంత్రిని సైతంహెచ్చరిస్తున్నానని అన్నారు. వాస్తవంగా బస్టాండ్ ఖాళీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణానికి బీఓటీ పద్దతిలో లీజుకు తీసుకున్నారు గంటా. ప్రత్యూష కన్స్ ట్రక్షన్ పేరుతో  కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని చూశారు. కానీ, మంత్రి అయ్యన్న దాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ  భూమిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో నిర్మాణం ప్రారంభం వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే..బుధవారం రాత్రి అదే సైట్ లో పనులు ప్రారంభం అవ్వడంతో  మంత్రి అయ్యన్న రచ్చకెక్కారు. 

English Title
war-between-the-twotdp-ministers

MORE FROM AUTHOR

RELATED ARTICLES