విజయసాయి, లక్ష్మీ నారాయణ మధ్య ట్విట్టర్ ‌వార్...పంచ్ డైలాగులతో...

విజయసాయి, లక్ష్మీ నారాయణ మధ్య ట్విట్టర్ ‌వార్...పంచ్ డైలాగులతో...
x
Highlights

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పది రోజులు గడుస్తున్నా పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. టీడీపీపై ఈసికి ఫిర్యాదులు, సీఎస్‌ లేఖలతో రాజకీయ వాతావరణాన్ని...

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పది రోజులు గడుస్తున్నా పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. టీడీపీపై ఈసికి ఫిర్యాదులు, సీఎస్‌ లేఖలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న వైసీపీ నేతలు తాజాగా జనసేనపై కూడా దాడి మొదలు పెట్టారు. విశాఖ లోక్‌సభ జనసేన అభ్యర్ధి వీవీ లక్ష్మినారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ట్వీట్టర్ వేదికగా సోషల్ వార్ కొనసాగుతోంది.

రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన అధికారంలోకి వస్తుందంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్‌గా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అటు పవన్ కళ్యాణ్‌ , ఇటు చంద్రబాబులను టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. 65 స్ధానాల్లో పోటీ చేసి 88 గెలిచి వస్తామని జోస్యం చెబుతున్నాడంటూ పంచ్ డైలాగ్ వేశారు. పనిలో పనిగా జేడీగా ఉన్న సమయంలో విచారించిన కేసులను ప్రస్తావిస్తూ ఇలాగే ఉన్నవి రాశాడంటూ ట్వీట్ చేశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా .. ? అంటూ ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి ట్వీట్‌కు లక్ష్మినారాయణ కూడా అదే స్ధాయిలో స్పందించారు. గౌరవనీయులంటూ సంబోధిస్తూనే మా లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయంటూ ట్వీట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మా లెక్కలు సరిగ్గా ఉంటాయి. సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. సత్యం, న్యాయంపై ఆధారపడి తాము పనిచేస్తామంటూనే మీ తప్పుడు లెక్కల వల్లే ఎంతో మంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలు పెట్టండంటూ సుత్తిమెత్తని చురకలు అంటించారు.

అటు విజయసాయిరెడ్డి ఇటు లక్ష్మినారాయణల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఎవరి ట్వీట్‌కు ఎవరు ఎలా సమాధానం ఇస్తారోనని నెటీజన్లు, రెండు పార్టీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికల నాటి పరిస్ధితులు ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు. టీడీపీ, జనసేనల ఒకటే అనే కోణంలో వైసీపీ విమర్శలు చేస్తుండగా తాము టీడీపీ,వైసీపీలకు సమాన దూరమైన కోణంలో జనసేనల మధ్య ట్వీట్ కొనసాగుతుందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories