అన్నీ సెట్అవుతే.. జూన్‌లోనే ఏపీలో సీఎం హోదాలో జగన్, కేసీఆర్‌ భేటీ ?

అన్నీ సెట్అవుతే.. జూన్‌లోనే ఏపీలో సీఎం హోదాలో జగన్, కేసీఆర్‌ భేటీ ?
x
Highlights

విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి వారిని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌ దైవ...

విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి వారిని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిదానానికి సీఎం విచ్చేసి, స్వరూపానందేంద్రస్వామివారి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే స్వరూపానంద స్వామీజీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్‌తోనూ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయం తెలిసిందే అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్లు చంద్రశేఖర్ రావు స్వరూపానంద రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ముందు స్వరూపానందేంద్రస్వామితో రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారీటీతో తెలంగాణకు రెండోసారి సీఎం కూర్చిలో కూర్చున్నారు. కాగా ఇటు ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక కేవలం ఎన్నికల ఫలితాలకోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే శారదా పీఠం స్వరూపానంద స్వామీజీకి కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులు కావాలనేది స్వామీజీ ప్రగాఢ వాంఛ.

ఇదిలా ఉంటే జూన్‌లో శారద పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవం కార్యక్రమం జరగనున్నట్లు స్వామిజీకి తెలిపారు. శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి స్వామీజీ కేసీఆర్‌ను ఆహ్వానించారు. జూన్‌ 15 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాల నిర్వహణ జరగనుంది. అయితే ఏపీలో మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. వచ్చేనెల అంటే జూన్ లో ఏపీలో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. అన్నీ అనుకూలించి ఏపీలో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే స్వరూపానందేంద్రస్వామి స్వామిజీ తలపెట్టిన ఉత్తరాధికారి మహోత్సవంలో కేసీఆర్‌తో పాటు కొత్తగా ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఇదంతా వచ్చేనెల మే 23తేదిన ఎన్నికల ఫలితాల మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఫలితాలు తారుమారు అవుతే మాత్రం కథఅడ్డం తిరిగినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories