జూన్‌ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు

జూన్‌ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు
x
Highlights

17 వ లోక్‌సభ షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెల 6 నుంచి మొదలు కానున్న సమావేశాలు 15 వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌కు...

17 వ లోక్‌సభ షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెల 6 నుంచి మొదలు కానున్న సమావేశాలు 15 వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అలాగే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. జూన్‌ 6 నుంచి 17 వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15 వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అలాగే గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాల్లో ర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం తర్వాత ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు 17 వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎంపీ సంతోశ్ గాంగ్వర్ ఎంపికయ్యారు. స్వతంత్ర హోదాలో కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు సభను నిర్వహిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడిని నియమించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బీజేపీ సైతం కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories