logo

బాహుబలి - 2ని బీట్ చేసిన.. విశ్వరూపం 2...!  

బాహుబలి - 2ని బీట్ చేసిన.. విశ్వరూపం 2...!  

భారీ అంచనాల మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ’విశ్వరూపం -2‘. లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు చెన్నైలో దుమ్మురేపాయి. టాక్ తో సంబంధం లేకుండా బాహుబలి 2 రికార్డును కమల్ సినిమా బద్దలు కొట్టింది. ’బాహుబలి 2‘ చెన్నైలో మొదటి రోజు రూ.92లక్షల వసూళ్లు రాబట్టగా... విశ్వరూపం 2 మొదటి రోజు రూ.93లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. కాలా, వివేగం,కబాలి, తేరి లాంటి సినిమాల తర్వాత విశ్వరూపం 2 ఉంది.

విశ్వరూపం సరీస్ కు మొదట్నుంచి అవాంతరాలు ఎదురవతూనే ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని విశ్వరూపం మొదటి పార్ట్ ఘన విజయం సాధించింది. రెండో పార్ట్ కు కూడా అలాంటి అవాంతరాలే ఎదురు కావడంతో సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లైవ్ టీవి

Share it
Top