వరలక్ష్మితో ఎఫైర్ గురించి స్పందించిన విశాల్!

Submitted by arun on Mon, 06/11/2018 - 12:58
vishal

చాలా కాలం తరువాత అభిమన్యుడు చిత్రంతో మంచి విజయం అందుకున్న విశాల్ జోష్ మీద ఉన్నాడు. సైబర్ వేదికగా జరుగుతున్న అక్రమాలని అభిమన్యుడు చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయంగా నిలిచింది. విశాల్, సమంత ఈ చిత్రంలో జంటగా నటించారు. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

చాలా రోజులుగా సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, విశాల్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు విశాల్ తనదైన శైలిలో స్పందించారు. వరలక్ష్మి తనకి మంచి స్నేహితురాలని ఆయన చెప్పారు. కష్ట సుఖాలను గురించి ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటామని అన్నారు. 'మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చారు. ఇక తమిళ రాజకీయాలకి సంబంధించిన విషయంపై మాట్లాడుతూ, రజనీ .. కమల్ విధివిధానాలపై ఒక స్పష్టత వచ్చాక ఎవరివెంట నడవాలనేది ఆలోచిస్తానని అన్నారు.   

English Title
Vishal on Relationship With Varalakshmi Sarathkumar

MORE FROM AUTHOR

RELATED ARTICLES