చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
x
Highlights

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై టాలీవుడ్ వైసీపీ నేత మంచుమోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత,...

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై టాలీవుడ్ వైసీపీ నేత మంచుమోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు పంచ్‌ డైలాగ్‌లు పేల్చారు. ప్రభుత్వమంటే నువ్వెక్కడివే కాదంటూ నిప్పులు చెరిగిన మోహన్‌బాబు మీపై కేసులు లేవా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. బాబూ పార్టీ ఇక ఉండదన్న మోహన్‌బాబు జగన్మోహన్‌రెడ్డికి ఒక్క ఛాన్సివ్వాలని ప్రజలను కోరారు. ప్రతి రోజు సభలో నేను నేను అనే చెప్పుకుంటున్నావ్. అసలు ఎవరు నీవు అని ప్రశ్నించారు. నీ వేనక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు లేరా ప్రశ్నించారు.

జగన్ మోహన్ మోహన్ పై ప్రతిరోజు మాటలు అంటున్నావ్ మరీ నీ పార్టీలో లేరా? నీ చుట్టునే ఉన్నారు దొంగలు మరీ ఆ దొంగల గురించి చెప్పవే.. ముఖ్మంగా నీ గురించి చెప్పు అని చంద్రబాబుని ప్రశ్నించారు. నీపై ఉన్నా కేసులను ఎందుకు విచారణకు రాకుండా ఎందుకు అక్కడే ఉన్నాయి అని మోహన్‌బాబు ప్రశ్నించారు. నువ్వు దొంగవు కదా! నీపై కేసులు లేవా అన్నారు. ఎదుటి వాడు బాగుంటే వొర్వలేని గుణం చంద్రబాబుదీ అని అన్నారు. కాళ్లు కడిగి కన్యధానం చేసిన సొంత మామాగారికే వెన్నుపోడిచిన నువ్వు బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నీదీ కాదు చంద్రబాబు. మీ మామా దగ్గరి నుండి లాక్కున్నదయ్యా తెలుగుదేశం. నీకు పార్టీ లేదు, నీ పునాది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories