రజనీకాంత్ కు మద్దతు ప్రకటించిన హీరో విశాల్

Submitted by arun on Thu, 01/04/2018 - 16:49

రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సినీ నటుడు రజనీకాంత్‌కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ రజనీకాంత్‌కు మద్దతు పలికారు. రజనీకాంత్‌ పార్టీలో రాఘవ లారెన్స్‌ చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక తమిళ చిత్రపరిశ్రమలో కీలక హీరోగా ఉన్న తెలుగు వ్యక్తి విశాల్‌ సైతం తాజాగా రజనీకాంత్‌ మద్దతు పలికారు.  రజనీ కోసం ఓ కార్యకర్తలా పని చేస్తానని... మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపాడు. రజనీకి విశాల్ మద్దతు పలకడం కీలక పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అతని నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో, నిరుత్సాహానికి గురైన విశాల్... ఆ ఎన్నికలో శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతు పలికాడు. ఆ తర్వాత దినకరన్ ఘన విజయం సాధించాడు. తాజాగా రజనీకి విశాల్ మద్దతు పలకడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

English Title
vishal Pledges Support to Rajinikanth’s Party

MORE FROM AUTHOR

RELATED ARTICLES