logo

విశాఖలో పోటీకి అభ్యర్దులే కరువు

విశాఖలో పోటీకి అభ్యర్దులే కరువు

విశాఖ లో పొలిటికల్ పార్టీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎన్నికల వేడి మొదలవుతున్నా పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు మాత్రం కరువుతున్నారు. ఢీల్లి లో నలుగురిలో ఒకరిలా వుండేకన్నా అసెంబ్లీస్థానం కుపోటీ చేసి నియోజకవర్గం లో పట్టుసాధించుకోవాలని నేతలు ఉబలాటపడుతున్నారు. దీంతో ఈ సారి కూడా విశాఖ ఎంపీ స్థానం స్థానికేతరులనే వరించే పరిస్థితి కనిపిస్తుంది.

విశాఖ పట్నం ప్రశాంత జీవనానికి అనువైన ప్రాంతం సుందర పర్యాటక కేంద్రాలకు చక్కటి వాతావరణానికి విశాఖ పెట్టింది పేరు విభజనకు ముందు కూడా విశాఖపై రాజకీయ పార్టీల ఫోకస్ పెరిగింది. విభజన తర్వాత విశాఖ ఏపి రెండో రాజధానిగా పేరు పడింది. అభివృద్ధి చెందింది స్మార్ట్ సిటీగా ఎంపిక కావడంతో కొన్ని అత్యాధునిక నిర్మాణాలూ అక్కడ జోరందుకుంటున్నాయి. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ విశాఖ నగరంలో
1990 కు ముందు వరకూ స్థానికులే ఎంపీలుగా గెలిచి ప్రజల మన్ననలు పొంది సేవలు అందించారు. అయితే తొంభైవ దశకం నుండి సీన్ మారిపోయింది. పాలిటిక్స్ లో పెట్టుబడుల జోరు పెరిగింది. దీంతో వైజాగ్ ఎంపీ సీటుకు డిమాండ్ పెరిగి స్థానికేతరులను ఈ స్థానం వరిస్తూ వచ్చింది. 1990 నుండి పరిశీలిస్తే విశాఖ ఎంపీలుగా గెలిచిన వారిలో 1996 లో టీ. సుబ్బిరామిరెడ్డి, 1999 లో ఎంవీ.వీ.ఎస్. మూర్తి, 2004 లో నెదురుమల్లి జనార్ధాన్ రెడ్డి, 2009 లో దగ్గుబాటి పురంధేశ్వరి వీరంతా నాన్ లోకల్సే దీంతో విశాఖకు అభివృద్ధిపథంతో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. ప్రజా ప్రతినిధులంతా బయటి వారే కావడంతో స్థానికంగా ఉండి సమస్యలను పరిశీలించి, పరిష్కరించే వ్యవస్థే లేకుండా పోయింది. 2014లో జగన్ తన తల్లి విజయమ్మను విశాఖ ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టారు ఆ టైమ్ లోనే లోకల్ నాన్ లోకల్ అన్న అంశం చర్చనీయాంశమైంది. విజయమ్మపై ఎన్డీఏ అభ్యర్ధిగా కంభం పాటి హరిబాబు నిలబడి విజయం సాధించారు. హరిబాబు స్థానికుడవటం విశాఖ నగరంలో చెప్పుకోదగ్గ రీతిలో ఉత్తరాది వలస ప్రజలూ ఉండటం బిజెపికి కలసి వచ్చింది. టీడిపి పోత్తులో భాగంగా ఎంపీ సీటు కేటాయించడంతో భారీ మెజారీటీ తో హారిబాబు ఎంపీ గా గెలుపొందారు.

అయితే విశాఖ నగరం వరకు ఎంపీ సీటు పరిస్థితి ఇలా వుంటే జిల్లా లో భాగమైన అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాలకు మాత్రం లోకల్ వారినే ఎన్నుకుంటున్నారు. ఒకటి రెండు సార్లు నాన్ లోకల్ వారు వచ్చినా పార్టీల జెండాలతో గెలుపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ప్రధాన పార్టీలకు తోడు జనసేన కూడా బరిలోకి దిగుతుండటంతో సమర్ధులైన అభ్యర్ధులకు కొరత కనిపిస్తోంది. స్థానికులకు పట్టం కట్టి సీటు కేటాయించే పరిస్థితి లేదు. అలా అని స్థానికేతరులను జనం ఆదరిస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా దశాబ్దాల కాలం నుండి రైల్వేజోన్ సమస్య పరిష్కారం కాకపోవడంతో దీని ప్రభావం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధులపై పడనుంది. ఎంపీగా పోటీ చేసి భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టినా ఢీల్లి లో అందరిలో ఒకరిగానే వుండాలి పైగా సొంత నియోజకవర్గాల్లో సమయం కేటాయించలేకపోవడంతో పాటు ప్రజా సమస్యల పై నేరుగా పనిచేసే అవకాశం తక్కువగా వుండటంతో నియోజకవర్గాల్లో పట్టుకోల్పోతామనే భయం కూడా నేతలను వెంటాడుతోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీల కు సమర్ధులైన నేతల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. హాట్ సీట్ గా మారిన విశాఖ ఎంపీ స్థానం మరి ఈ సారి లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ లో ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

లైవ్ టీవి

Share it
Top