విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!
x
Highlights

విభజన హామీల అమలు కోసం అటు మిత్రపక్షం టీడీపీ నుంచి ఇటు ఏపీ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం జాగ్రత్తగా అడుగులేస్తోంది....

విభజన హామీల అమలు కోసం అటు మిత్రపక్షం టీడీపీ నుంచి ఇటు ఏపీ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం జాగ్రత్తగా అడుగులేస్తోంది. పరిస్థితి చేయి దాటకముందే శాంతింపజేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రస్తుతానికి రైల్వే జోన్‌‌పై ప్రాథమిక ప్రకటన చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించిన కేంద్రం విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి కొత్త రైల్వే జోన్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ప్రాథమిక ప్రకటనచేసి వారం రోజుల్లో బౌండరీస్‌ డిసైడ్‌ చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ను కేంద్ర పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది.

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఒడిషా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రదాన్‌ విశాఖ జోన్‌ ఏర్పాటుతో తన సొంత రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వాదించినట్లు తెలుస్తోంది. దాంతో ధర్మేంద్ర ప్రదాన్‌‌తో చర్చలు జరిపిన కేంద్ర పెద్దలు ఒడిషాకు ఎలాంటి నష్టం లేకుండా కొత్త జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించినట్లు చెబుతున్నారు. ఆ మేరకు వాల్తేరు డివిజన్‌లో 80శాతం ప్రస్తుత జోన్‌‌లోనే ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీని సంతృప్తిపర్చడానికి ఇప్పటికిప్పుడు కొత్త రైల్వే జోన్‌పై ప్రాథమిక ప్రకటన చేసినా మార్చిలో కంప్లీట్‌ అనౌన్స్‌మెంట్‌ వస్తుందని అంటున్నారు.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్‌లో ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొస్తున్న బీజేపీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్‌ ఏర్పాటుకు గ్రీన్‌‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌‌ ఏర్పాటుపై ఒడిషా నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒప్పించడంతో కేంద్రం సక్సెస్‌ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకున్న సమాచారం మేరకు వాల్తేరు డివిజన్‌‌లో 80శాతాన్ని ఒడిషాకి వదిలిపెట్టి దక్షిణమధ్యరైల్వే పరిధిలోని గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories