కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ రావును కూడా పిలవాలి: చిన్నారెడ్డి

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ రావును కూడా పిలవాలి: చిన్నారెడ్డి
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు ఈనెల21 ప్రారంభోత్సవం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రారంభోత్సవానికి సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును కూడా...

కాళేశ్వరం ప్రాజెక్టు ఈనెల21 ప్రారంభోత్సవం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రారంభోత్సవానికి సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును కూడా పిలవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. తామే కష్టపడినట్లు తండ్రి, కొడుకులు (కేసీఆర్, కేటీఆర్) ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం సరికాదని అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ కేసీఆర్ దే అయినప్పటికీ రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి అయ్యిందంటే అదంతా హరీశ్ కష్టమేనని అన్నారు. ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ కూడా వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల్లోచోటు చేసుకునే అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, ఫడ్నవిస్ వచ్చినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories