నాలుగో టెస్టులో అందుకే ఓడిపోయాం : కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 08:51
virat-kohli-says-england-braver-us-tougher-situations

ఐదు  టెస్టుల సిరీస్ లో భాగంగా  జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 60 పరుగుల తేడాతో గెలిచి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లి (130 బంతుల్లో 58; 4 ఫోర్లు), అజింక్య రహానే (159 బంతుల్లో 51; 1 ఫోర్‌) మంచి స్కోర్ సాధించినా ఆ తరువాత  వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి చెందిన భారత్  ఇకపై పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఓటమి అనంతరం మాట్లాడిన కోహ్లీ..   కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిందని, అందుకే తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుతంగా ఆడి టీంఇండియాకు ఆధిక్యం అందించాడు.  రెండో ఇన్నింగ్స్‌లో రహానే పరిస్థితుల తగ్గట్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లపై  అంతగా నెగటీవ్‌ ఏం లేకపోయినా.. సానుకూల దృక్పథంతో ఫైనల్‌ మ్యాచ్‌పై దృష్టిసారిస్తాం అని కోహ్లీ అన్నాడు. 

English Title
virat-kohli-says-england-braver-us-tougher-situations

MORE FROM AUTHOR

RELATED ARTICLES