కోహ్లీ షాంపైన్‌ బాటిల్‌ కథ

Submitted by arun on Thu, 08/23/2018 - 14:16
vk

క్రికెట్‌ జట్టు కెప్టెన్, చిచ్చర పిడుగు, విరాట్‌ కోహ్లీ,

తన కోచ్‌ రవిశాస్త్రికి విజయసూచికగా చూపుతూ,

ఓ ప్రతేకమైన కానుక ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

అది ఒక  షాంపైన్‌ బాటిల్‌ చేతిలో ఉంచుతూ.  శ్రీ.కో. 


భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్, చిచ్చర పిడుగు.. విరాట్‌ కోహ్లీ తన కోచ్‌ రవిశాస్త్రికి ఓ ప్రతేకమైన కానుక ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. . అదేంటో మీకు  తెలుసా? అది ఒక  షాంపైన్‌ బాటిల్‌. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అవార్డు కింద ట్రోఫీతో పాటు నిర్వాహకులు కోహ్లీకి ఓ ఫాంపైన్‌ బాటిల్‌ని కూడా అందజేశారు. ఈ బాటిల్‌ను తీసుకున్న కోహ్లీ ముందుగా డ్రస్సింగ్‌ రూమ్‌ వెలుపల కూర్చుని ఉన్న కోచ్‌ రవిశాస్త్రి వద్దకు వెళ్లి అతని చేతిలో ఈ బాటిల్ పెట్టాడు. కోచ్ పై తనకు ఉన్న భావాన్ని కోహ్లీ ఇలా చాటాడు అని అందరు అనుకుంటున్నారు.

English Title
Virat Kohli, man-of-the-match, gifts his champagne bottle to Ravi Shastri

MORE FROM AUTHOR

RELATED ARTICLES