నాని మాటలు నిజం కాబోతున్నాయా

నాని మాటలు నిజం కాబోతున్నాయా
x
Highlights

దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా హిట్ అయితేనే ఆ దర్శకుడు పాపులర్ అయిపోతాడు. అదే వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక నిర్మాతలు కూడా దర్శకుడి ఇంటి...

దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా హిట్ అయితేనే ఆ దర్శకుడు పాపులర్ అయిపోతాడు. అదే వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక నిర్మాతలు కూడా దర్శకుడి ఇంటి ముందు క్యూ కట్టేస్తారు. సరిగ్గా అదే గౌతమ్ తిన్ననూరి కి కూడా జరిగింది. మొదటి సినిమా 'మళ్ళీ రావా' తోనే సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు 'జెర్సీ'తో మరొక సూపర్ హిట్ అందుకున్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటూ మంచి వసూళ్లు సైతం నమోదు చేసుకుంటోంది.

ఈ సినిమా కి భారీగా పాజిటివ్ రివ్యూస్ అందుతూ ఉండడంతో, సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది హీరోలు కూడా గౌతమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు నిర్మాతలు కూడా గౌతమ్ మీద ఫోకస్ చేశారు. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ బ్యానర్లు కూడా అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. అలా నాని సినిమా తో గౌతమ్ రేంజి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. అలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "గౌతమ్ చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, నువ్వు పెద్దయ్యాక మాత్రం గౌతం కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అవుతావు" అని గౌతమ్ తనయుడితో అన్నాడు నాని. ఇప్పుడా మాటలే నిజమయ్యేలా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories