విరాట్ కొహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు

విరాట్ కొహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు
x
Highlights

ప్రస్తుత సౌతాఫ్రికా టూర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని ఓ అరుదైన అసాధారణ రికార్డు ఊరిస్తోంది. సఫారీలతో తీన్మార్ టీ-20 సిరీస్ చివరి రెండుమ్యాచ్...

ప్రస్తుత సౌతాఫ్రికా టూర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని ఓ అరుదైన అసాధారణ రికార్డు ఊరిస్తోంది. సఫారీలతో తీన్మార్ టీ-20 సిరీస్ చివరి రెండుమ్యాచ్ ల్లో కొహ్లీ 130 పరుగులు సాధించగలిగితే వెయ్యి పరుగుల మైలురాయిని చేరడమే కాదు గతంలో ఇదే రికార్డు సాధించిన కరీబియన్ దిగ్గజం ద గ్రేట్ వివియన్ రిచర్డ్స్ సరసన నిలువగలుగుతాడు. ప్రస్తుత టూర్ టెస్ట్ సిరీస్ నుంచి టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ వరకూ విరాట్ కొహ్లీ మొత్తం 870 పరుగులు సాధించాడు. 1976 సీజన్లో వీవ్ రిచర్డ్స్ ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్ ల టెస్ట్, వన్డే సిరీస్ ల్లో కలిపి ఏకంగా వెయ్యి పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును అందుకొనే అవకాశం ఇప్పుడు విరాట్ కొహ్లీకి వచ్చింది. ఓ సింగిల్ టూర్ లో ఓ విదేశీ క్రికెటర్ వెయ్యి పరుగులు సాధించడం
వీవ్ రిచర్డ్స్ తోనే ప్రారంభమయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories