ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం : రజత్ కుమార్

ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం : రజత్ కుమార్
x
Highlights

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంనుండి 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ఈనెల 23వతేదీన...

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంనుండి 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ఈనెల 23వతేదీన జరపడానికి రాష్ట్రంలోని ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో పూర్తి సంసిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు 18 జిల్లాలలోని 35 ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన 82 హాళ్ళలో ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుంది. వీటిలో 110 సెగ్మెంట్లలో 15 (14+1)టేబుళ్ళను, నిజామాబాద్‌ లోని 7 సెగ్మెంట్లలో19(18+1) టేబుళ్ళను, మల్కాజిగిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్.బి.నగర్ లలోని 2 సెగ్మెంట్లలో 29(28+1) టేబుళ్ళను ఏర్పాటు చేసారు.

ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మపరిశీలకుడు ఉంటారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డిఇఓ ఉంటారు. వీరుగాక 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారు. మొత్తం 6745 మంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు.

లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు వివిపాట్లలోని పేపర్ స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఎన్నికల ఫలితాల ప్రకటన మూడుగంటలు ఆలస్యం కావచ్చని రజత్ కుమార్ తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ప్రతి కేంద్రంలో సరిపడా మంచినీరు, ఓ.ఆర్‌.ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య చికిత్స సదుపాయాలు కల్పించినట్లు ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories