బుల్లెట్ ప్రూఫ్ లేకుండా రాహుల్..అడవిలో ఏం చేస్తున్నట్లు?

బుల్లెట్ ప్రూఫ్ లేకుండా రాహుల్..అడవిలో ఏం చేస్తున్నట్లు?
x
Highlights

అదొక దట్టమైన అటవీ ప్రాంతం క్రూరమృగాలు సంచరించే ప్రాంతం ఇంకా చెప్పాలంటే మావోయిస్టుల అడ్డా అలాంటి దట్టమైన అడవిలో ఓ రెండు గంటల పాటూ రాహుల్ శాస్త్రోక్తంగా...

అదొక దట్టమైన అటవీ ప్రాంతం క్రూరమృగాలు సంచరించే ప్రాంతం ఇంకా చెప్పాలంటే మావోయిస్టుల అడ్డా అలాంటి దట్టమైన అడవిలో ఓ రెండు గంటల పాటూ రాహుల్ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న నేత,కాంగ్రెస్ పార్టీ అధినేత, దేశ భావి ప్రధాని అదీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా కలియ తిరిగిన సందర్భం ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?

దక్షిణాదిన పట్టు బిగించాలనుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేరళలోని వయనాడ్ లో ఎన్నికల ప్రచారానికి ముందు హిందూ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు చక్కని పంచె కట్టులో నుదుటన బొట్టు పెట్టుకుని వయనాడ్ లోని తిరునెల్లిలో బ్రహ్మ గిరి కొండలపై ఉన్న వైష‌్ణవాలయానికి వచ్చారు.

ఎప్పుడూ విమానాలు, హెలికాప్టర్లలో తిరిగే రాహుల్ పట్టు పంచె కట్టుకుని కాలినడకన చాలా దూరం నడిచారు. కేరళలోని వయనాడ్ నుంచి బరిలో ఉన్న రాహుల్ రెండు రోజుల ప్రచారం కోసం కేరళ వచ్చారు. బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి పూర్తి సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఆలయ సందర్శన చేశారు. వయనాడ్ లోని పాపనాశిని నదిలో తన తండ్రికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన అస్తికలు కలిపిన పవిత్ర నదులలో పాపనాశిని నది కూడా ఉంది. తండ్రి రాజీవ్, నాయనమ్మ ఇందిర, ముత్తాత నెహ్రూలతో సహా తన పూర్వీకులు ఏడు తరాలకు శాస్త్రోక్తంగా తర్పణలు వదిలారు. పూజారి చెపుతున్న మంత్రాలను వల్లె వేస్తూ వాటి ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు.

తన పూర్వీకులతో పాటూ పుల్వామా అమర వీరులకు, ఘర్షణల్లో చనిపోయిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ హిందూ సంప్రదాయ పద్ధతిలో తర్పణలు వదిలారు. దక్షిణ కాశీగా చెప్పుకునే తిరు నెల్లి ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపై ఉంది. ఈ ఆలయంలో మహా విష్ణువు శయనిస్తాడని చెబుతుంటారు. సాధారణంగా టైమ్ షెడ్యూల్ ని ఖచ్చితంగా పాటించే రాహుల్ స్థానిక కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు పూర్తి సమయం వారికే కేటాయించారు. హెలికాప్టర్ లో అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడ పవిత్ర స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకుని అంగవస్త్రం కప్పుకుని నడక సాగించారు.

దర్శనానంతరం హుండీకి కానుకలు కూడా సమర్పించారు. ఆలయ పూజారిని సంప్రదాయలను అడిగి మరీ తెలుసుకున్న రాహుల్ అక్కడ నుంచి 700 మీటర్ల దూరంలో ఉన్న మహాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. మావోయిస్టులకు నిలయమైన ఆ అటవీ ప్రాంతంలో రాహుల్ ఎలాంటి చెప్పులు లేకుండా నడచి వెళ్లడం భద్రతా సిబ్బందికి చెమటలు పట్టించింది. దారంతా కొండలు, బండలు, పెద్ద పెద్ద రాళ్లు, గుట్టలు ఉండటంతో రాహుల్ కాస్త ఇబ్బంది పడ్డారు.

దాదాపు 45 నిమిషాలు ఆలయంలో గడిపిన రాహుల్ ఆ తర్వాత సుల్తాన్ బాతెరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. రాహుల్ ఆసక్తి చూపినందునే ఈ పర్యటనకు ప్లాన్ చేశామంటున్నారు కేరళ మాజీ సీఎం ఊమన్ చాందీ నామినేషన్ వేసినప్పుడే ఈ పూజాదికాలు చేయాలనుకున్నా భద్రతా కారణాలతో సెక్యూరిటీ సిబ్బంది వద్దనడంతో ట్రిప్ ఆగిపోయింది. కానీ ఈసారి రాహుల్ స్వయంగా జోక్యం చేసుకుని ఆలయ సందర్శనకు ఓకే చెప్పడంతో కేరళ కాంగ్రెస్ పెద్దలు ఈ పర్యటన ప్లాన్ చేశారు. దైవ దర్శనానంతరం రాహుల్ పలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.



























Show Full Article
Print Article
Next Story
More Stories