పేలిన స్కూటర్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

పేలిన స్కూటర్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
x
Highlights

పాప ఆడుకునే స్కూటర్‌కి చార్జింగ్ పెట్టాడు ఓ తండ్రి. ఇంతలో చిన్న శబ్దం. తీరా చూస్తే ఛార్జింగ్ పెట్టిన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. ఈ ఘటన చైనాలో...

పాప ఆడుకునే స్కూటర్‌కి చార్జింగ్ పెట్టాడు ఓ తండ్రి. ఇంతలో చిన్న శబ్దం. తీరా చూస్తే ఛార్జింగ్ పెట్టిన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. ఈ ఘటన చైనాలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ ఇంట్లో ఎవరి పనిలో వారు బిజీగా వున్నారు. పాప ఆడుకోవడానికని ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టాడు పాప తండ్రి. ఆ తరువాత హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు తండ్రీ కూతుళ్లు. మొదట చిన్న శబ్ధం రావడంతో అక్కడే ఉన్న పెంపుడు కుక్క భయపడి అరవడం మొదలు పెట్టింది. అనంతరం స్కూటర్ నుంచి పొగలు వస్తుండడంతో వెంటనే చార్జింగ్ ప్లగ్ తీసేసారు. అయినా స్కూటర్ నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి.దీంతో తండ్రి వెంటనే పాపని తీసుకుని బయటకు పరిగెట్టారు. వారు బయటకు వెళ్లిన మరుక్షణం స్కూటర్ పెద్ద శబ్ధం చేస్తూ పేలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు కొద్ది దూరంలో ఉన్న తండ్రీ కూతుళ్లు చిన్న చిన్న గాయాలతో బయటపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ పేలుడుకి హాల్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడు ఘటన రికార్డయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories